Trisha | త్రిష బర్త్ డే స్పెషల్.. పోస్టర్ విడుదల,అవనిగా మెప్పించనున్న చెన్నై చంద్రం
Trisha | మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఎపిక్ ‘విశ్వంభర’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నటి త్రిష కృష్ఱన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పోస్టర్లో త్రిష ట్రెడిషనల్ లుక్‌లో డివైన్ ఔరాతో కనిపిస్తూ ఆకట్టుకుంది.
Trisha | మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఎపిక్ ‘విశ్వంభర’ సినిమా ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నటి త్రిష కృష్ఱన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ పోస్టర్లో త్రిష ట్రెడిషనల్ లుక్‌లో డివైన్ ఔరాతో కనిపిస్తూ ఆకట్టుకుంది. అయితే ఇది కేవలం గ్లామర్ పాత్ర మాత్రమే కాదని, కథలో కీలక పాత్ర పోషించబోతుందని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, త్రిష పోషిస్తున్న ‘అవని’ పాత్ర సినిమా కథలో కీలక మలుపులు తీసుకువచ్చే ప్రధాన అంశంగా ఉండనుంది.
ముఖ్యంగా ఈ పాత్ర చుట్టూనే సినిమా నెరేషన్ తిరిగే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు త్రిష చేసిన పాత్రలతో పోలిస్తే, ఈ పాత్రలో ఎక్కువ ఎమోషనల్ వెయిట్, డెప్త్ ఉండబోతుందని తెలుస్తోంది. కేవలం స్క్రీన్ ప్రెజెన్స్కే పరిమితం కాకుండా, కథను ముందుకు నడిపించే డ్రైవింగ్ ఫోర్స్‌గా అవని పాత్ర ఉండటం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. గత కొన్నేళ్లుగా సెలెక్టివ్ ప్రాజెక్ట్స్‌తో ముందుకు సాగుతున్న త్రిషకు ‘విశ్వంభర’ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్ర దక్కడం ఆమె కెరీర్‌కు మరో మైలురాయిగా మారవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక మెగాస్టార్ చిరంజీవి-త్రిష కాంబినేషన్ కూడా ఈ సినిమాకు మరో ప్రధాన హైలైట్. గతంలో వీరిద్దరి మధ్య ఉన్న ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో వారి పాత్రలు ఎలా మలచబడ్డాయో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరి ట్రాక్ సినిమా ఎమోషనల్ కోర్గా నిలుస్తుందని టాక్. ఈ చిత్రానికి దర్శకుడు వశిష్ట విజువల్ ట్రీట్ ఇవ్వడానికి భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాయని సమాచారం. దీంతో ‘విశ్వంభర’ విజువల్‌గా కూడా అద్భుతంగా ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వేగంగా కొనసాగుతోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం టాలీవుడ్లో నెవర్ బిఫోర్ అనిపించే స్థాయిలో ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో రూపొందుతోంది. మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశముంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

