TN Election Results | తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. బోసిపోయిన డీఎంకే కార్యాలయం..!
TN Election Results | తమిళనాడు (Tamil Nadu) లో నటుడు, టీవీకే పార్టీ చీఫ్ (TVK Party Chief) విజయ్ ప్రభంజనం సృష్టించారు. మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ (Exit Polls) అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 234 స్థానాలకుగానూ ఆ పార్టీ సుమారు 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
TN Election Results : తమిళనాడు (Tamil Nadu) లో నటుడు, టీవీకే పార్టీ చీఫ్ (TVK Party Chief) విజయ్ ప్రభంజనం సృష్టించారు. మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ (Exit Polls) అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 234 స్థానాలకుగానూ ఆ పార్టీ సుమారు 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అన్నాడీఎంకే (AIADMK) 70కి పైగా స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్నది. ఇక అధికార డీఎంకే (DMK) పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ కేవలం 60 దాకా స్థానాల్లో ఆధిక్యంతో మూడోస్థానానికి పరిమితమైంది.
దాంతో డీఎంకే శ్రేణులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాయి. ప్రతికూల ఫలితాల కారణంగా కార్యకర్తలు, నేతలు ఎవరూ రాకపోవడంతో చెన్నైలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం బోసిపోయింది. పలు నియోజకవర్గాల్లో ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ కార్యకర్తలు భోరున విలపించారు. ఇక గెలిస్తే సంబురాలు చేసుకోవడం కోసం డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో అన్నీ తొలగిస్తున్నారు. సంబురాల కోసం వేసిన టెంట్లను తీసేశారు. ఆటపాటలతో ఎంజాయ్ చేయడం కోసం తెప్పించిన ఇతర సామాగ్రిని తిప్పిపంపించారు.
Chennai, Tamil Nadu: At Anna Arivalayam, the DMK headquarters in Chennai, tents are being dismantled as early trends show the party trailing in a distant third position pic.twitter.com/rxF7txntWN
— IANS (@ians_india) May 4, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

