Prajavani | సిద్దిపేట అర్బన్, మార్చి 17 : ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ , అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 43 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్..
సిద్దిపేట అర్బన్, మార్చి 17 : జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పక్కన గల ఈవీఎం గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఇవాళ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. త్రైమాసిక కాల పరిశీలనలో భాగంగా గోడౌన్ చుట్టూ కలియతిరిగారు. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం చుట్టూ సీసీ కెమెరాల పనితీరు, పోలీస్ అధికారుల బందోబస్తు ఏర్పాటు, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ చేయాలని సూచించారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు