KD Devil | ‘కెడి డెవిల్’ సాంగ్ వివాదం.. డబుల్ మీనింగ్ లిరిక్స్‌పై నెటిజన్ల ఆగ్రహం
KD Devil | “కాదేది బూతుకు అనర్హం” అన్న సినీ కవి మాటలను నిజం చేస్తూ కొందరు సినిమాల్లో బోల్డ్ కంటెంట్ పెంచుతున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కన్నడ పాన్ ఇండియా చిత్రం ‘కెడి డెవిల్’ నుంచి విడుదలైన ‘సర్కే చునర్ తేరి సర్కే’ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
KD Devil | “కాదేది బూతుకు అనర్హం” అన్న సినీ కవి మాటలను నిజం చేస్తూ కొందరు సినిమాల్లో బోల్డ్ కంటెంట్ పెంచుతున్నారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కన్నడ పాన్ ఇండియా చిత్రం ‘కెడి డెవిల్’ నుంచి విడుదలైన ‘సర్కే చునర్ తేరి సర్కే’ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పాట హిందీ వెర్షన్‌ను తెలుగు ప్రముఖ గాయని మంగ్లీ ఆలపించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే బ్యానర్ నుంచి త్వరలో ‘జన నాయకుడు’, ‘టాక్సిక్’, అలాగే మెగాస్టార్‌తో దర్శకుడు బాబీ కొల్లి చేయబోయే సినిమా కూడా రాబోతున్నాయి. దీంతో ‘కెడి డెవిల్’పై కూడా భారీ హైప్ ఏర్పడింది.
అయితే తాజాగా విడుదలైన ఈ పాట మాత్రం వివాదానికి కేంద్రంగా మారింది. రకీబ్ ఆలం రాసిన సాహిత్యంలో ఎక్కువగా ద్వందార్థాలు ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్‌ని ఉద్దేశించి ఐటెం గర్ల్ నోరా ఫతేహి పాడుతున్నట్టుగా ఈ పాటను చిత్రీకరించారు. బోల్డ్ లిరిక్స్‌తో పాటు చిత్రీకరణ కూడా ఘాటుగా ఉండటంతో ఇది మరింత విమర్శలకు కారణమైంది.ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పాటపై ట్రోలింగ్ మొదలైంది. ఇలాంటి పాటలను చిన్నపిల్లలు రీల్స్‌లో అనుకరిస్తే బాధ్యత ఎవరిది? అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వివాదం ఇంకా పెద్దదయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ధృవ్ సర్జా హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామాకు దర్శకుడు ప్రేమ్ దర్శకత్వం వహించారు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ సినిమా నిర్మాణంలో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని వేసవి సీజన్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే గతంలో ధృవ్ సర్జా నటించిన ‘మార్టిన్’ సినిమా ఘోరంగా విఫలం కావడంతో ఆ ప్రభావం ‘కెడి డెవిల్’పై పడిందని బెంగళూరు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం పలు సమస్యలతో సతమతమవుతోంది. ‘జన నాయకుడు’ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాకపోవడం, వడ్డీల భారం పెరగడం, ఓటీటీ డీల్ ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు ‘టాక్సిక్’ సినిమా కూడా మార్చి నుంచి జూన్‌కు వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో ‘కెడి డెవిల్’ సాంగ్‌పై వచ్చిన ఈ కొత్త వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
Gadwal | గద్వాలలో భారీ వర్షం..మారిన వాతావరణంతో ఉపశమనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

