Suriya New Movie | గజిని చిన్నారే మమితా బైజు? సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై క్రేజీ రూమర్
Suriya Movie | తమిళ నటుడు సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంపై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది.
Vishwanath And Sons Teaser | తమిళ నటుడు సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంపై సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. గతంలో సూర్య నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘గజిని’లో క్లైమాక్స్‌లో కనిపించిన ఆ చిన్నారే ఇప్పుడు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో హీరోయిన్గా నటిస్తున్న మమితా బైజు అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం ఉంది అనేది మాత్రం తెలియదు. ఇక ఈ క్రేజీ రూమర్ పుట్టడానికి ప్రధాన కారణం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’లో సూర్య పోషిస్తున్న పాత్ర పేరు ‘సంజయ్ విశ్వనాథ్’ కావడమే. గజినిలో సూర్య పేరు సంజయ్ రామస్వామి కావడంతో, నెటిజన్లు సరదాగా ఆ పాత జ్ఞాపకాలను ఈ సినిమాతో ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు ఈ సినిమా విషయానికి వస్తే, దర్శకుడు వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని ఒక విభిన్నమైన ప్రేమకథగా రూపొందిస్తున్నారు. ఇందులో సూర్య 40 ఏళ్ల వయసున్న ప్రొఫెషనల్ షూటర్‌గా కనిపిస్తుండగా, మమితా బైజు 20 ఏళ్ల యువతిగా నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం చుట్టూ సాగే ఎమోషనల్ డ్రామానే ఈ చిత్ర కథాంశం. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని డైలాగులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రం 2026 జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Really 🤯
Mamitha va idhu 🤔 pic.twitter.com/mZiqSgGGmw— OTT Trackers (@OTT_Trackers) March 17, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్‌కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
Medicover | కిడ్నీ చికిత్సకు పోతే కాటికి పంపిండ్రు.. మెడికవర్‌లో న్యాయవాది మృతి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్‌లకు షాక్.. ఈ వారం నామినేషన్లలో ఆ ఆరుగురు!
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

