HYDRAA | బండ్లగూడ, మార్చి 17 : కాలనీల మధ్య రోడ్డు సమన్వయం కోసం అడ్డుగా ఉన్న గోడను హైడ్రా అధికారులు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కూల్చివేశారు. బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫార్చ్యూన్ మేడ్ హౌస్ కాలనీ, హర్షిత కాలనీకి మధ్యలో ఉన్న అడ్డుగోడను తొలగించాలని స్థానిక కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి రోడ్డు మధ్యలో ఉన్న తొలగించారు. దీంతో స్థానిక ప్రజలు వర్షం వ్యక్తం చేశారు.