| తొగుట, ఏప్రిల్ 4 : ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కే హరికృష్ణారెడ్డి పేర్కొన్నారు.
గజ్వేల్ సంఘటనపై వారు మాట్లాడుతూ.. ‘ఇందిరమ్మ రాజ్యం’ అని చెప్పుకుంటూ, రేవంత్ రాష్ట్రాన్ని పూర్తిగా ‘గూండాల రాజ్యం’గా మార్చేశారన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపైనే దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా..? లేనట్లా..? అని ఆయన ప్రశ్నించారు..
పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి కాంగ్రెస్కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. దాడులకు పాల్పడుతున్న మూకలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల చిల్లర దాడులకు బీఆర్ఎస్ ఏమాత్రం భయపడదన్నారు. గ్రామ సభల్లో ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారని, మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫొటో పెట్టాలని అనుకుంటే అధికారులు చర్యలు తీసుకోవాలని, కాంగ్రెస్ నాయకులకు ఏం అధికారం ఉందని ఆయన ప్రశ్నించారు. గ్రామ సభల్లో ఎమ్మెల్యే ఫోటోలు పెట్టడం లేదని, ప్రజాస్వామ్యాన్ని పాతర వేస్తున్నారని విమర్శించారు. క్యాంపు కార్యాలయంలో దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వారి వెంట నాయకులు వేల్పుల స్వామి, బండారు స్వామి గౌడ్, జహంగీర్, రాజు తదితరులున్నారు.
SI Srinivas | యువత భవిష్యత్తు గంజాయితో నాశనం : ఎస్సై శ్రీనివాస్
MLA Kova Laxmi | మహంకాళి జాతరలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు
Hanuman Jayanti | భక్తిశ్రద్ధలతో ఘనంగా హన్మాన్ జయంతి వేడుకలు