రెబ్బెన : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరా నగర్ గ్రామంలోని స్వయంభూ శ్రీ కనకదుర్గా దేవి శ్రీ మహంకాళి దేవస్థానంలో శుక్రవారం మహంకాళి జాతర ( Mahankali temple ) ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ( MLA Kova Laxmi ) అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకోగా, ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడం తిరుపతి గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ స్వామి, కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోవా లక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు , ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.