Revenue division | చేర్యాల, జూలై 20 : చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజల ఆకాంక్ష మేరకు తక్షణమే చేర్యాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ది చెప్పడం ఖాయమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ కంట్రోల్ కమిటీ చైర్మన్ అందె బీరన్న అన్నారు.
పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు జనగామ ఎన్నికల సభలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే రెవెన్యూ డివిజన్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఒక్క సభలో మాట్లాడ లేదని, ఎన్నికల ముందు గ్రామగ్రామాన చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సదరు వ్యక్తి నోరు విప్పడం లేదన్నారు.
భువనగిరి ఎంపీగా గెలిచిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం తాను విజయం సాధించిన వెంటనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. డివిజన్ ఏర్పాటు కోసం ఈ నెల 25న జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే చేర్యాల బంద్‌కు అన్నివర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు పుల్ల ఆంజనేయులు, నాయకులు యాదయ్య, రాజు, తిరుపతి, నవీన్, వెంకటేశం, ఐలయ్య పాల్గొన్నారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి