కట్టంగూర్, జూలై 20: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. కట్టంగూర్ పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సబ్సిడిపై అందించే ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదేశించారు. ఎరువుల కొరత సృష్టించి బ్లాక్‌లో అధిక ధరలకు రైతులకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రతి రోజుల సిబ్బంది సహకార సంఘంలో అందుబాటులో ఉంటూ రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల విక్రయించాలని సూచించారు.
కార్యక్రమంలో ఏఓ గిరి ప్రసాద్, పీఏసీఎస్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి డీ. నాగేశ్వర్ రావు, పీఏసీఎస్ సీఈఓ బండ మల్లా రెడ్డి, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండు పరమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య, నాయకులు రెడ్డిపల్లి సాగర్, ముక్కామల శేఖర్, రెడ్డిపల్లి స్వామి, గట్టిగొర్ల సత్తయ్య, మిట్టపల్లి శివ, గోశిక అంజన్ కుమార్, అయితగోని నర్సింహ్మ, పాపట్ల వెంకట్ రెడ్డి, పోగుల చంద్రయ్య, కానుగు శ్రీను, మేడి విజయ్, పీఏసీఎస్ సిబ్బంది చెరుకు యాదగిరి, సైదులు, యాదగిరి, సైదమ్మ, గంటెకంపు లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.