Weed killer | తొగుట మార్చి 16 : రైతులు గట్లపై గడ్డిని తొలగించడానికి పారాక్వాట్ కలుపు మందు వినియోగిస్తున్నారని.. పారాక్వాట్ అన్ని మందులతో పోలిస్తే చాలా విషపూరితమైనదని వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున అన్నారు. పర్యావరణానికి, మనుషులకు హాని కలిగె అవకాశం అధికంగా ఉంది. కావున రైతులు పారాక్వాట్ బదులుగా గ్లూఫోసినేట్ అమ్మోనియం వినియోగించాలని నాగార్జున సూచించారు.
ఎల్లారెడ్డిపేట్ గ్రామం వరి పంట పొలాలను వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లూఫోసినేట్-అమ్మోనియం పారాక్వాట్తో పోలిస్తే తక్కువ విషపూరితమైనదన్నారు. పారాక్వాట్ డైక్లోరైడ్ లాగానే గ్లూఫోసినేట్ అమ్మోనియం కూడా నాన్-సెలెక్టివ్ కాంటాక్ట్ హెర్బిసైడ్.. అంటే ఏదో ఒక రకం కలుపు మొక్కనో లేదా ఏవో కొన్ని రకాల కలుపు మొక్కలనో నిర్మూలించడానికి ఉద్దేశించింది కాదన్నారు. ఇది తాకిన అన్ని ఆకుపచ్చ మొక్కల కణజాలాలను చంపుతుంది లేదా దెబ్బతీస్తుంది. వేగంగా పనిచేసే రసాయనం. పొలం గట్లు, తోటలలో మొలిచే గడ్డి, వెడల్పాటి ఆకు కలుపును ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. ఇది పిచికారీ చేసిన 2-3 రోజుల్లోనే కలుపు మొక్కలను ఎండిపోయేలా చేస్తుందని తెలిపారు.
పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
రైతులు ఆయిల్ పామ్ తోటలో కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు మందు పంటపై పడకుండా చూసుకోవాలని.. దీనికోసం ‘స్ప్రే హుడ్’ (Spray Hood) ఉపయోగించడం మంచిదని ఏఈఓ నాగార్జున సూచించారు. కలుపు మొక్కలు 3 అంగుళాల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మొక్కలు కాస్త తడిగా ఉన్నప్పుడు లేదా తేమ ఉన్నప్పుడు పిచికారీ చేస్తే మందు బాగా పనిచేస్తుంది అని ఏఈఓ నాగార్జున తెలిపారు.
Chinmayi | వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డ్.. పవన్ కళ్యాణ్ విష్ చేయడంతో సింగర్ చిన్మయి తీవ్ర విమర్శలు
Akshay Kumar | తండ్రిని కోల్పోయిన బాధని గుర్తుచేసుకున్న అక్షయ్ కుమార్.. పురుషులకు కీలక సూచన