Ajinkya Rahane :అంతర్జాతీయ క్రికెట్ సహా ఫ్రాఛైంజీ టోర్నీలకు సైతం వీడ్కోలు పలికిన అజింక్యా రహానే (Ajinkya Rahane)కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్ధికంగా అండగా నిలువనుంది. మిడిలార్డర్ బ్యాటర్‌గా, వైస్ కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం భారత జట్టుకు సేవలందించిన అతడికి ప్రతినెలా ఫిక్స్డ్ పింఛను(Fixed Pension) ఇవ్వనుంది. అందరూ మాజీఆటగాళ్ల మాదిరిగానే అతడికి కూడా పెద్ద మొత్తంలో ముట్టజెప్పనుంది బీసీసీఐ. ఇకనుంచి నెలనెలా రూ.70 వేలు పింఛను రూపంలో రహానే అందుకోనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.
పునరాగమనం కోసం నిరీక్షించి.. సెలెక్టర్ల వైఖరితో వీడ్కోలు పలికిన అజింక్యా రహానే ఇకపై కూడా బీసీసీఐ నుంచి ఆదాయం అందుకోనున్నాడు. రిటైర్మెంట్ అనంతరం మాజీలకు ఆనవాయితీగా ఇచ్చే మంత్లీ పింఛన్ ఇప్పుడు రహానేకు దక్కనుంది. టీమిండియా తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడిన ఈ వెటరన్ బీసీసీఐ ఫిక్స్డ్ పింఛనుకు అర్హత సాధించాడు. 80కి పైగా టెస్టులు ఆడినందున ఇకనుంచి భారత బోర్డు ప్రతి నెలా అతడికి రూ.70 వేలు చెల్లించనుంది.
Ajinkya Rahane will receive a monthly pension of ₹70,000 from the BCCI after retiring from international cricket. 🇮🇳💙
Having represented India in 85 Test matches, Rahane qualifies for the highest pension slab under the BCCI’s welfare scheme for former cricketers. 💸#India… pic.twitter.com/zmxY5zZvjj
— Sportskeeda (@Sportskeeda) August 2, 2026
మొదట్లో రహానే అంత అనుభమున్న మాజీ ఆటగాళ్లకు నెలకు రూ.50 వేలు మాత్రమే ఇచ్చేవారు. కానీ, నాలుగేళ్ల క్రితం సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ మొత్తాన్ని మరో 20 వేలకు పెంచారు. దాంతో.. అప్పటి నుంచి వీడ్కోలు పలికిన భారత ఆటగాళ్లకు ప్రతినెలా ఫిక్స్డ్ పింఛనుగా రూ.70లు ఇస్తోంది బీసీసీఐ.
‘మాజీ ఆటగాళ్లు ఆర్ధికంగా మంచి స్థితిలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన వాళ్లకు వీడ్కోలు అనంతరం ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐ మీద ఉంది’ అని ఫిక్స్డ్ పింఛనును రూ.70వేలకు పెంచడంలో తన ఉద్దేశాన్ని వెల్లడించాడు గంగూలీ.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రహానే తన తదుపరి ప్రణాళికలు ఏంటీ? అనేది ఇంకా వెల్లడించలేదు. సుదీర్ఘ అంతర్జాతీయ అనుభవమున్న అతడు కోచ్‌గా అవతారమెత్తే అవకాశాల్ని కొట్టిపారేయలేం. వచ్చే సీజన్ ఐపీఎల్లో అతడిని క్రికెట్ డైరెక్టర్ లేదా.. బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపినా ఆశ్చర్యమేమీలేదు.