Panchayat Secretary | చేర్యాల, జులై 3 : మరొక మహిళతో గుట్టు చప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శిని పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన చేర్యాల పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. బాధితురాలు జ్యోతితోపాటు బంధువులు తెలిపిన వివరాల మేరకు.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రానికి చెందిన ఏటి బాబు సిద్దిపేట రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
పంచాయతీ కార్యదర్శి బాబు భార్య జ్యోతి అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో బాబు రాంపూర్‌లో విధులు నిర్వహిస్తూ ఏపీకి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తూ చేర్యాల పట్టణంలో నివాసం ఉంటున్నాడు.
తన భర్త బాబు మరో మహిళతో చేర్యాలలో ఉంటున్నట్లు తెలుసుకున్న భార్య జ్యోతి తన బంధువులతో వచ్చి బాబు కిరాయి ఉంటున్న ఇంటికి వెళ్లింది. ఇద్దరినీ నిలదీయడంతోపాటు వారికి దేహశుద్ధి చేసింది. ఈ సమయంలో పంచాయతీ కార్యదర్శి సైతం భార్యపై చేయిచేసుకున్నాడు. ఇరువురు గొడవపడుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కాగా ఇరువర్గాలు పోలీసులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్