Oil palm cultivation | రాయపోల్ అక్టోబర్ 14 : సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో రైతు నాచగిరి ఆయిల్ పామ్ తోటలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రైతు నాచగిరి తన 3.20 ఎకరాల తోటలో కేవలం 6 నెలలలోనే సుమారుగా 1,85,000 రూపాయలు ఆదాయాన్ని గడించారు.
రైతు నాచగిరి తమ అనుభవాలన్నీ, ఆయిల్ పామ్ సాగులో గల మెళకువలు, లాభాలు, నికర ఆదాయం, మల్చింగ్ విధానం, నీటి సరఫరా విధాన, సస్యరక్షణ చర్యలు గురించి పూర్తిగా వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ సహాయ సంచాలకులు బాబు నాయక్, మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్, ప్లాంట్ మానిటరింగ్ ఆఫీసర్ రాములు, ఏఈవో ప్రవీణ్ , ఫీల్డ్ అసిస్టెంట్ రాకేష్, రాయపోల్ మండల పరిధిలోని రైతులు పాల్గొనడం జరిగింది.
Mirage OTT | ఓటీటీలోకి ‘దృశ్యం’ దర్శకుడి కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!
Murder | తెనాలి చెంచుపేటలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య