Jeethu Joseph | మలయాళ సినిమా ఇండస్ట్రీలో థ్రిల్లర్ జానర్‌కు పెట్టింది పేరు జీతు జోసెఫ్. ‘దృశ్యం’ సిరీస్‌తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సాధించిన ఈ దర్శకుడు ప్రస్తుతం ‘దృశ్యం 3’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే అతని దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మిరాజ్’. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీని లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక సోని లివ్‌లో ఈ చిత్రం అక్టోబర్ 20 నుంచి మలయాళంతో పాటు తమిళం, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అభిరామి (అపర్ణ బాలమురళి) తన ప్రేమికుడు కిరణ్ (హకీమ్ షాజహాన్)ను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే అభిరామికి పోలీస్ స్టేషన్ నుంచి కబురు రాగా.. సడన్‌గా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అభిరామికి కిరణ్ రైలు ప్రమాదంలో మరణించాడనే షాకింగ్ న్యూస్ వస్తుంది. ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోకముందే.. ఓ పోలీస్ ఆఫీసర్ (సంపత్ రాజ్), రౌడీ (శరవణన్), ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ (ఆసిఫ్ అలీ) వంటి వ్యక్తులు అభిరామిని ఓ మిస్టీరియస్ హార్డ్ డిస్క్ గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అయితే ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది? కిరణ్ మరణం వెనుక రహస్యం ఏమిటి? అభిరామి ఈ డేంజర్ నుంచి ఎస్కేప్ అవుతుందా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.