Gopal Mandal : అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో బీహార్ (Bihar) లో కోలాహలం నెలకొన్నది. అధికార, ప్రతిపక్ష కూటమిలు సీట్ల షేరింగ్ కసరత్తులు, అభ్యర్థుల ఎంపికల్లో బిజీబిజీగా ఉన్నాయి. అధికార కూటమిలో సీట్ల షేరింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రతిపక్ష కూటమిలో ఇంకా కసరత్తు జరుగుతోంది. తొలి దశ పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్ల (Nominations) దాఖలుకు ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉన్నాయి. అయినా ఎన్డీయే, మహాఘట్బంధన్ కూటమిలు ఇంకా అభ్యర్థుల జాబితాలు ప్రకటించలేదు.
అధికార కూటమిలోని జేడీయూ కూడా ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పటికీ.. పొత్తులో భాగంగా తన సిట్టింగ్ స్థానమైన గోపాల్పూర్ను బీజేపీకి వదిలేసింది. దాంతో గోపాల్పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ మనస్తాపానికి గురయ్యారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అడిగేందుకు మంగళవారం ఉదయం ఆయన సీఎం నితీశ్ నివాసానికి వెళ్లగా.. అప్పాయింట్మెంట్ లేదన్న కారణంతో సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించలేదు.
దాంతో గోపాల్ మండల్.. నితీశ్ కుమార్ ఇంటి గేటు ముందు బైఠాయించారు. తాను సీఎంను కలవాలని వచ్చానని, సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో ఉదయం 8.30 గంటల నుంచి ఇక్కడ బైఠాయించానని చెప్పారు. తాను ఎమ్మెల్యే టికెట్ పొంది తీరుతానని, ఎమ్మెల్యే టికెట్ తీసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు.
#WATCH | Patna, Bihar| JD(U) MLA Gopal Mandal sits on the ground outside CM Nitish Kumar’s house over his demand to meet the CM to get an election ticket from Gopalpur Assembly constituency in the upcoming Bihar elections pic.twitter.com/arVO3PwbkO
— ANI (@ANI) October 14, 2025
#WATCH | Patna, Bihar | JD(U) MLA Gopal Mandal says, ” I want to meet the CM. I have been waiting here since 0830 hours. I will get the election ticket. I won’t go without getting it.” pic.twitter.com/H1llhEvoJ1
— ANI (@ANI) October 14, 2025
కాగా, గోపాల్ మండల్ మాత్రమే కాకుండా వివిధ నియోజకవర్గాలకు చెందిన జేడీయూ కార్యకర్తలు కూడా సీఎం నితీశ్ ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజవర్గాల్లో బీజేపీ నేతలకు టికెట్లు ఇచ్చి సొంత పార్టీ నాయకులకు అన్యాయం చేశారని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఇంటిముందు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.