రాయపోల్, ఆగస్టు 11 : దౌల్తాబాద్ చౌరస్తాలో గత కొన్ని రోజుల నుంచి మంచినీటి పైప్లైన్ లీకేజీ కావడంతో చౌరస్తా ఆవరణలో నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో స్థానికులకు, ప్రయాణికులకు ఎంతో ఇబ్బందిగా మారింది. అధికారుల కండ్ల ముందే నీరు లీకేజీలు కావడంతో వారు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఉదయం నల్లా నీళ్లు రావడంతో రోడ్డుపై ప్రవహించడం వల్ల స్థానికులకు, వచ్చిపోయే వాహనాలకు ఎంతో ఇబ్బందిగా మారింది. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని జిల్లా అధికార యంత్రాంగం మండల స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కిందిస్థాయి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా వద్ద గత కొన్ని రోజుల నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కావడంతో రోడ్డుపై నీరు వృధాగా పోతుండడంతో వచ్చిపోయే వాహనాలకు, అక్కడనే ఉన్న షాప్ యజమానులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రత్యేక అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
పరిసరాల పరిశుభ్రతపై గ్రామపంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాల్సింది పోయి కేవలం కార్యాలయంలో ఉండి వచ్చిపోతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ దుస్థితి నెలకొందని విమర్శలు వస్తున్నాయి. చౌరస్తాలోనే గుంతలు, ఆపై నల్ల లీకేజీలు ఏర్పడడంతో ఎంతో అందంగా ఉండాల్సిన చౌరస్తా అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా చౌరస్తాలో సమస్యలకు నిలయంగా మారింది. కనీసం గుంతలో మట్టి పోయించి.
పైప్ లైన్ లీకేజీ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి గ్రామపంచాయతీకి, సిబ్బందికి ఉంటుంది. కానీ ఎప్పుడూ చూడు చౌరస్తా వద్ద అలానే దర్శనమిస్తుంది. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వలన ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు, స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు మండల అధికారులకు ఆదేశాలు ఇచ్చి దౌల్తాబాద్ మండల కేంద్రంలో లీకేజీలు ఉన్న పైప్లైన్లను మరమ్మతులు చేసి.. చౌరస్తా వద్ద పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు చేపట్టాలని మండల కేంద్ర ప్రజలు కోరుతున్నారు.
urea | గన్నేరువరంలో యూరియా కోసం బారులు తీరిన రైతులు
Farmers concern | యూరియా కొరతపై రైతుల ఆందోళన.. పోలీసుల పహారాలో పంపిణీ
Karepalli | కారేపల్లి మండలంలో నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ