urea | గన్నేరువరం, ఆగస్టు11: గన్నేరువరం మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ముందు యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు బారులు తీరారు. యూరియా 200 బస్తాలు రాగా రైతుల ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్ జిరాక్సులను అందజేయగా ఆన్లైన్లో నమోదు చేసుకొని ఆధార్ కార్డుకు ఒకటి, రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటే గాని యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. యూరియా కొరత ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని, యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరిగారు.