Teachers | చేగుంట, జులై 03 : ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించినప్పుడే విద్యార్థులకు సరైన విద్యాభ్యాసం వస్తుందని, తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మన్, చేగుంట మండల అధ్యక్షుడు రావుల వెంకటేష్‌లు పేర్కొన్నారు. చేగుంట మండలకేంద్రంతో పాటు, మక్కరాజ్‌పేట, కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులతో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చెపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడి నియమించాలని, ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, జీవో 317బాధితులందరికి న్యాయం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేసి, పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపిఎస్ విదానాన్ని అమలు చేయాలని, సమగ్రశిక్ష అభియాన్ ఉద్యోగులకు సమ్మె కాలపు వేతనం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 కింద వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తపస్ అధ్యక్షకార్యదర్శులు రావుల వెంకటేష్,తంగెళ్లపల్లి కృష్ణమూర్తి,రేఖ,మధునాల శ్రీనివాస్,సంగీత,అమరేశ్వరి,రాధా సరస్వతి,సునీత,మంజులత,సంధ్యారాణి,వీణ,సలీం,బంగారయ్య,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్