Grain Purchase Centres | రాయపోల్, అక్టోబర్ 10 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలోని రాయపోల్ తిమ్మక్కపల్లి, మంతూర్, అనాజిపూర్, చిన్న మాసంపల్లి, కొత్తపల్లి, ఆరేపల్లి, వడ్డేపల్లి, ఎలుకల్ గ్రామంలో శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీవో జమ్లా నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలను పాటించాలని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం వరి ధాన్యానికి ఏ గ్రేడ్ ధర 2,389, బి గ్రేడ్ ధర 2,369 కేటాయించడం జరిగిందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎం యాదగిరి, ఆర్ఐ రాజమల్లు, సీనియర్ అసిస్టెంట్ మోతాబ్ అలీ, ఏఈఓలు రజిత, సీసీలు నాగరాజు, కుమార్, రోజా, అంజమ్మ, వివోఏలు మల్లేశం, నర్సింలు, సుభద్ర,నరేందర్ రెడ్డి, విజయ,భాను,లావణ్య, రేణుక, బిక్షపతి,శోభ, మండల మహిళా కోశాధికారి సౌందర్య, సెంటర్ నిర్వాహకులు , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Pending Fees | పెండింగ్ ఫీజులు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి
Tejashwi Yadav | ఆర్జేడీని గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం.. బీహారీలకు తేజస్వియాదవ్ హామీ
Penpahad : మానవాళి శ్రేయస్సుకే అంతరిక్ష ప్రయోగాలు : సీనియర్ సైంటిస్ట్ వెంకటరమణ