పెన్పహాడ్, అక్టోబర్ 10 : అంతరిక్ష ప్రయోగాలు మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగ పడతాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్ట్ సీహెచ్.వెంకటరమణ అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ లో నిర్వహించిన ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
ఉపగ్రహాల ప్రయోగ ప్రక్రియ, రాకెట్ సాంకేతికత, అంతరిక్ష పరిశోధనలో భారతదేశం సాధించిన విజయాలు వంటి అంశాలను సవివరంగా వివరించారు. విద్యార్థుల సందేహాలను తీర్చుతూ, వారిలో సైన్స్ పట్ల ఆసక్తి, శాస్త్రీయ దృక్పథం పెంపొందించేలా ప్రేరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నకిరేకంటి రవి, ప్రిన్సిపాల్ కోడి లింగయ్య, గురుచరణ్, క్రాంతికుమార్, సోమయ్య, భాస్కర్ పాల్గొన్నారు.
Penpahad : మానవాళి శ్రేయస్సుకే అంతరిక్ష ప్రయోగాలు : సీనియర్ సైంటిస్ట్ వెంకటరమణ