Rahul Gandhi | రాహుల్జీ.. ఇదేనా ప్రజాస్వామ్య పరిరక్షణ?.. ‘గాంధీ సరోవర్’ బాధిత చిన్నారుల లేఖలు
Rahul Gandhi | ప్రభుత్వ వ్యవస్థలు పేదల ప్రజలకు అండగా ఉండాలని గతంలో మీరు చెప్పిన మాటలు మూసీ బాధితులకు వర్తించవా..? అని ‘గాంధీ సరోవర్' బాధిత చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని నిలదీశారు.
Rahul Gandhi | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వ్యవస్థలు పేదల ప్రజలకు అండగా ఉండాలని గతంలో మీరు చెప్పిన మాటలు మూసీ బాధితులకు వర్తించవా..? అని ‘గాంధీ సరోవర్’ బాధిత చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని నిలదీశారు. ఈ మేరకు వారు రాహుల్‌గాంధీకి బుధవారం లేఖలు రాశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, సామాన్య పౌరులకు అండగా నిలవాలని మీరు చెప్పే వ్యాఖ్యల పట్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు.
దేశ ప్రజల గొంతుక వినాలని చెప్తున్న రాహుల్.. మూసీ ప్రాజెక్టు విషయంలో తమ గొంతుకను ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము ఖర్చు చేసేటప్పుడు ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని రాహుల్ గతంలో చెప్పారని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకోకుండా కట్టే ప్రాజెక్టులతో ఏం లాభమని చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేతను ప్రశ్నించారు.
ఇండ్లు కూలగొట్టి విగ్రహమా?: వై సతీశ్‌రెడ్డి
పేదలు ఎన్నో కలలుగని కట్టుకున్న ఇండ్లను గాంధీ విగ్రహం కోసం కూల్చడం ఏమిటని బీఆర్ఎస్ నేత వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన ‘గాంధీ సరోవర్’ బాధిత చిన్నారులు రాహుల్‌గాంధీకి లేఖ రాస్తున్న ఫొటోలను పోస్టు చేశారు. జీవితం మొత్తం కష్టపడి దాచుకున్న డబ్బుతో కట్టుకున్న ఇండ్లను ‘గాంధీ సరోవర్’ కట్టడానికి ధ్వంసం చేయడం సరికాదని అన్నారు.
సీనియర్ సిటిజన్లు, ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులను వారి ఇండ్ల నుంచి బయటకు గెంటేయడం చూస్తుంటే గుండె పగులుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయన వ్యాపార భాగస్వాములకు ఈ ప్రాజెక్టును అప్పగించేందుకు శుక్రవారం చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఇదే రోజు ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్‌కు గడువుగా విధించారని స్పష్టం చేశారు. ఈ విషయంలో పౌర సమాజం మొత్తం బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

