నార్నూర్ : బెస్ట్ అవైలబుల్ పాఠశాల ( Best available school ) లో విద్యను అభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థుల పెండింగ్ ఫీజులు ( Pending fees ) చెల్లించి ఆదుకోవాలని జై భారత్ జిల్లా కో ఆర్డినేటర్ పేందోర్ దీపక్, రాజ్ గోండు సేవా సమితి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు కుమ్ర చతుర్షావ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని కుమ్రం భీం చౌరస్తా వద్ద వారు మాట్లాడారు.
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదివే విద్యార్థుల పెండింగ్ ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలకు రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబంలో ఫీజులు కట్టలేక బడికి పంపించలేక ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవో స్పందించి విద్యార్థుల ఫీజులు చెల్లించేలా కృషిచేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ పరిషత్ విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు ఆత్రం జాలీం షావ్, ప్రధాన కార్యదర్శి అర్కా గోవింద్, రిషి కుమార్ ఉన్నారు.