local body Elections | రాయపోల్, జులై 28 : కాంగ్రెస్ పాలనలో ప్రజలు రైతులు హరిగోస పడుతున్నారని.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ఇప్ప దయాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోతున్నా అమలు చేయకపోవడంతో ప్రభుత్వ పనితీరును ప్రజలు అసహ్యించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజల హృదయాలను గెలుచుకుందని.. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. సొంత పార్టీలోని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సమన్వయం లేకపోవడం వలన రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. నీళ్లు నిధులు. నియామకాలపై తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాలు కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిన విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పాలన వచ్చినప్పటి నుంచి రైతులకు ప్రజలకు కష్టాలు తప్పడం లేదని.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ప్రజలకు ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన గులాబీ జెండా వైపు ప్రజలు ఉండి విజయపథంలో నడిపించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎన్ని కుట్రలు చేసిన రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Hathnoora | ఆదాయం ఉన్న సౌకర్యాలు సున్నా.. పలుగు పోచమ్మ ఆలయం వద్ద భక్తుల ఇక్కట్లు
Roads | సారూ మా రోడ్లు బాగు చేయరా.. బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన
Additional collector Nagesh | ప్రాజెక్టులు, చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దు : అదనపు కలెక్టర్ నగేష్