Additional collector Nagesh | మెదక్ రూరల్, జులై 27 : భారీ వర్షాల వలన ప్రజలు ఎవ్వరూ కూడా ప్రాజెక్టులు, చెరువుల దగ్గరకు వెళ్లరాదని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ఆదివారం భారీ నీటి ప్రవాహం కారణంగా హవేలీ ఘన్ పూర్ మండలం దూప్ సింగ్ తండా వాగు పొంగి పొర్లుతుంది. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ నగేష్ రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు.
వరద ఉధృతి ఉన్న దగ్గర హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని, భారీ వర్షాలు వరదల వలన ప్రజలు చెరువులు దగ్గరకు వెళ్ళరాదని హెచ్చరించారు. వరద పరిస్థితిని నిశితంగా పరిశీలించాలన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే వెంటనే తమకు నివేదించాలని.. ప్రజలను ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా చూడాలని అధికారులతో అన్నారు.
ప్రస్తుతం దూప్ సింగ్ తండాకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ నగేష్ వెంట ఎమ్మార్వో, సిబ్బంది ఉన్నారు.
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. బిడ్డను బస్టాండ్లో వదిలి వెళ్లిన తల్లి
KTR | ఎరువులు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Snake in Temple | ఆలయంలో పాము కలకలం.. భయంతో హడలిపోయిన భక్తులు.. Video