హైదరాబాద్ : నల్లగొండ(Nallagonda )జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి ఆ బాలుడి పట్ల కర్కశంగా వ్యవహరించింది. తన పొత్తిళ్లలో భద్రంగా చూసుకోవాల్సిన కన్నతల్లే కనికరం లేకుండా బస్టాండ్లో వదిలివేసిన(Mother leaves son )ఈ అమానవీయ సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది.
ఓ మహిళ తన రెండ్లేండ బిడ్డతో వచ్చి నల్లగొండ బస్టాండ్లో వదిలివేసి ఓ వ్యక్తితో బైక్పై వెళ్లింది. తల్లి కోసం బాలుడు గుక్కపట్టి ఓడవడంతో గమనించిన ఆర్టీసీ సిబ్బంది గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా బాలుడి తల్లిదండ్రులను గుర్తించి చిన్నారని తండ్రికి అప్పగించారు. పూర్తి వివరాలు తెయాల్సి ఉంది.