Virosh | ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న బ్యూటిఫుల్ మూమెంట్ చివరికి నిజమైంది. సిల్వర్‌స్క్రీన్‌పై తమ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేసిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట ఏడడుగులు నడిచింది. అనంతరం తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఒకరికొకరు రాసుకున్న ప్రేమ సందేశాలతో అందరి హృదయాలను గెలుచుకున్నారు. వెడ్డింగ్ ఫొటోలు బయటకు రాగానే సెటబ్రిటీల నుంచి భారీ ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ రష్మిక పెళ్లి ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేస్తూ, “కంగ్రాట్స్ రష్మిక, విజయ్! మీ జీవితం ప్రేమ, సంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నా” అంటూ స్వీట్ మెసేజ్ పోస్ట్ చేశాడు.
అలాగే రష్మిక కామెంట్ సెక్షన్ సెలబ్రిటీల విషెస్‌తో సెలబ్రేషన్ జోన్లా మారిపోయింది. కృతి సనన్ “కంగ్రాట్స్ రష్షూ! మీ ఇద్దరికీ లైఫ్‌టైమ్ హ్యాపీనెస్ దక్కాలి” అని కామెంట్ చేయగా, ఆయుష్మాన్ ఖురానా “హార్టియెస్ట్ కంగ్రాట్స్ గాయ్స్” అంటూ విష్ చేశాడు. వీరితో పాటు హన్సిక, మోనా సింగ్, ఇషాన్ ఖట్టర్, మీరా రాజ్‌పుత్, అర్జున్ కపూర్, రియా చక్రవర్తి, నేహా ధూపియా తదితరులు ఈ న్యూ కపుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నేచురల్ స్టార్ నాని ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ బ్యూటిఫుల్ కపుల్‌కి బోలెడంత ప్రేమ, కంగ్రాట్స్… మీ దాంపత్య జీవితం మరింత అందంగా సాగాలి డియర్ విజయ్, రష్మిక అంటూ ఎమోషనల్ నోట్ రాశాడు. అటు సమంత రూత్ ప్రభు కూడా విజయ్ పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ స్పార్క్లింగ్ ఎమోజీలతో కంగ్రాట్స్ తెలిపింది.
అయితే ఈ వెడ్డింగ్ అనౌన్స్మెంట్లో అందరి మనసులను ఎక్కువగా గెలుచుకున్నవి విజయ్ – రష్మిక ఒకరికొకరు రాసుకున్న ఎమోషనల్ మెసేజ్‌లే.విజయ్ తన పోస్ట్‌లో రష్మిక తన జీవితంలో ఎంత ముఖ్యమో చాలా క్యూట్‌గా వివరించాడు. ఆమె పక్కన లేకపోతే అంతా వెలితిగా అనిపిస్తుంది. ఆమె లేని భోజనం రుచించదు. వర్కౌట్స్ కూడా ఒక శిక్షలా అనిపిస్తాయి. ఆమె దగ్గరే నాకు ప్రశాంతత దొరుకుతుంది. ఈ ఫీలింగ్స్ అన్నీ అర్థమయ్యాకే… నా బెస్ట్ ఫ్రెండ్‌ని నా భార్యగా చేసుకున్నా అంటూ తన ప్రేమను వ్యక్తపరిచాడు. రష్మిక రాసిన నోట్ కూడా అంతే టచింగ్‌గా ఉంది. విజయ్‌ని తన భర్తగా ప్రపంచానికి పరిచయం చేస్తూ, “నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో, మనశ్శాంతి అంటే ఏంటో నాకు నేర్పింది అతనే. నా కలల్ని నిజం చేసుకునేలా ఎప్పుడూ నన్ను ఎంకరేజ్ చేశాడు. సక్సెస్, ఫెయిల్యూర్, సంతోషం, బాధ… ప్రతి అడుగులోనూ నాకు తోడున్నాడు. ఈ రోజు అతన్ని నా భర్తగా పిలవడం నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది” అంటూ తన ఆనందాన్ని అక్షరాల్లో చూపించింది.
ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ ఫొటోలు, లవ్ నోట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’, ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు. రీల్ లైఫ్‌లో మొదలైన ప్రేమకథ, రియల్ లైఫ్‌లోనూ హ్యాపీ ఎండింగ్ అందుకోవడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది.