గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్
వివాదాలకు.. వివాదాస్పద నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిన జేఎన్టీయూహెచ్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఎప్‌సెట్ ఆఫీస్‌ను గెస్ట్‌హౌస్‌కు కేటాయించింది.
- మహిళా ఉద్యోగుల విశ్రాంతి కేంద్రానికి కేటాయింపు
- జేఎన్టీయూలో కొనసాగుతున్న అడ్మిషన్లు.. ఇదే సమయంలో మార్పు
- ఫలితంగా ఎప్‌సెట్ గోప్యతకు ఎసరు !
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : వివాదాలకు.. వివాదాస్పద నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిన జేఎన్టీయూహెచ్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఎప్‌సెట్ ఆఫీస్‌ను గెస్ట్‌హౌస్‌కు కేటాయించింది. అత్యంత కీలకమైన ఎప్‌సెట్ కార్యాలయాన్ని ‘మహిళా ఉద్యోగుల వెయిటింగ్ హాల్ – పర్సనల్ కేర్ అండ్ వెల్నెస్ ఫెసిలిటీ’కి కేటాయిస్తూ రిజిస్ట్రార్ డాక్టర్ జయలక్ష్మి సోమవారం సర్యులర్ జారీ చేశారు. ఉద్యోగినుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయా సర్క్యులర్‌లో పేరొన్నారు. ఎప్‌సెట్ పరీక్షలను జేఎన్టీయూ దశాబ్దాలుగా నిర్వహిస్తున్నది.
అత్యంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించిన ఘనత వర్సిటీ సొంతం. ఎప్‌సెట్‌కు ప్రత్యేకంగా వర్సిటీలో ఆఫీసు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయంలోకి ఎవరిని పడితే వారిని అనుమతించబోరు. కంప్యూటర్లు.. సర్వర్లున్నాయి. నిత్యం సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. ప్రవేశ పరీక్షల నిర్వహణలో అత్యంత కీలకమైన, అత్యంత గోప్యంగా ఉంచాల్సిన కార్యాలయాన్ని మహిళా ఉద్యోగుల వెల్నెస్ సెంటర్‌గా మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి డిసెంబర్లో 2027 ఎప్‌సెట్‌కు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది. ఈ రికార్డులు, వివరాలు, ఫైళ్ల ఆధారంగానే 2027 ఎప్‌సెట్ నిర్వహణ జరుగుతుంది. ఇవేవి పట్టించుకోకుండా కేటాయించడంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అడ్మిషన్ల వేళ ఏమిటీ నిర్ణయం
రాష్ట్రంలో అడ్మిషన్ల సీజన్ ఇంకా నడుస్తున్నది. బీఎస్సీ నర్సింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ముగియగా, మరికొన్ని విడతల అడ్మిషన్ కౌన్సెలింగ్ చేపట్టాల్సి ఉంది. బీ-ఫార్మసీ ప్రవేశాల ప్రక్రియ కూడా ఇంకా పూర్తికాలేదు. ఇలాంటి కీలక సమయంలో ఎప్‌సెట్ కార్యాలయాన్ని గెస్ట్‌హౌస్‌గా మార్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నలు, రికార్డులు, అడ్మిషన్ల సమాచారం, ఇతర సున్నితమైన వివరాలు ఉండే కార్యాలయంలోకి ఇతరుల రాకపోకలకు అవకాశం కల్పిస్తే గోప్యతకు భంగం కలిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని జేఎన్టీయూహెచ్ ఉపసంహరించుకోవాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రంగంలోకి ఉన్నత విద్యామండలి
ఎప్‌సెట్ కార్యాలయం కేటాయింపు అంశంపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులందాయి. దీనిపై మండలి తీవ్రంగా స్పందించింది. మండలికి, ఎప్‌సెట్ విభాగం అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గెస్ట్‌హౌస్‌గా మార్చడంపై అభ్యంతరం వ్యక్తంచేసినట్టు సమాచారం. దీనిపై మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి స్పందిస్తూ.. ఎప్‌సెట్ అత్యంత గోప్యతతో కూడుకున్న ప్రక్రియ అని, ఈ కార్యాలయాన్ని వెల్నెస్సెంటర్గా వినియోగించడానికి వీల్లేదని పేరొన్నారు. మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని వర్సిటీ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. పరీక్షలు, ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన గోప్యతకు ఎలాంటి విఘాతం కలుగకుండా వర్సిటీని చూడాలని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

