మునుగోడు, ఫిబ్రవరి 27 : మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు సభ్యుడు బాలకృష్ణ, సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, వార్డు సభ్యులు పందుల రంజిత్, ఎండి అన్వర్, పరమేశ్, కట్ట రాజు, పందుల నరసింహ, దుబ్బ ప్రభాకర్, జంగం యశ్వంత్ పాల్గొన్నారు.