– బద్దం కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడలో వాలీబాల్ పోటీలు ప్రారంభం
కోదాడ, ఆగస్టు 08 : 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బద్దం కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు (అండర్-14, అండర్-18) వాలీబాల్ పోటీలను ట్రస్ట్ చైర్మన్ బద్దం భద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ట్రస్ట్ చైర్మన్ బద్దం భద్రారెడ్డి మాట్లాడుతూ తాను అత్యంత పేదరికంలో పుట్టానని, ఒకనాడు తినడానికి అన్నం లేక ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ, నిరంతర శ్రమ, పట్టుదలతో కష్టపడి నేడు ఈ ఉన్నత స్థానానికి చేరుకున్నట్లు తెలిపారు. భవిష్యత్లో కూడా తమ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు అన్ని రకాల సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు అందిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఏనుగు ఉపేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షేక్ బషీర్, పందిరి నాగిరెడ్డి, కౌన్సిలర్ సైదిబాబు, మామిడి రామారావు, పట్టణ ప్రముఖులు వేముల వెంకటేశ్వర్లు, వేనేపల్లి శ్రీనివాసరావు, నామా నరసింహారావు, బడుగుల సైదులు, పంది తిరుపతయ్య, ముస్తఫా ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, చారి, కొండల్ పాల్గొన్నారు.

‘క్రీడల్లో రాణించి ఉన్నత స్థానాలకు చేరాలి’