Roads | మెదక్ రూరల్, జూలై 27 : మెదక్ మండలంలోని హవేలీ ఘన్పూర్ , దూప్ సింగ్ తాండ, మల్కాపూర్‌లోని స్కూల్ తాండ, పలుగ్రామాల్లో ఉన్న అంతర్గత రహదారులు వర్షం కురిస్తే పూర్తిగా బురదమయం అవుతాయి. దీంతో కనీసం నడవడానికి కూడా వీలు కావడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు వెళ్లేందుకు అంతర్గత మట్టి రోడ్లు మాత్రమే దిక్కు. ఇవన్నీ వర్షాలు పడితే పూర్తిగా బురదగా మారుతాయి.
నిత్యం ప్రజలు ఈ రోడ్ల గుండా రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు ఈ రోడ్ల గుండానే వెళ్తారు. ఈ రోడ్లను బాగుచేస్తే ఆయా గ్రామాల ప్రజలకు ప్రయాణం సులభతరంగా మారుతుంది. కానీ అధికారులు గానీ పాలకులు గానీ మా గోస పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ తాండ వాసులు బురద రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
వర్షాకాలంలో మట్టిరోడ్లు అస్థవ్యస్తంగా తయారయ్యాయన్నారు స్కూల్ తాండ వాసులు. కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయని.. రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు.
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. బిడ్డను బస్టాండ్‌లో వదిలి వెళ్లిన తల్లి
KTR | ఎరువులు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Snake in Temple | ఆలయంలో పాము కలకలం.. భయంతో హడలిపోయిన భక్తులు.. Video