Education | మిరుదొడ్డి, జూలై 16 : విద్యార్థులు విద్యను కష్టమనకుండా ఇష్టంతో అభ్యసించి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, నైపుణ్య ఆర్గనైజేషన్ సంస్థ జిల్లా అధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు.
2024-2025 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో మండల టాపర్గా నిలిచిన శృతికి రూ.10వేలు, శ్రీ నిత్యకు రూ.7500, మనీషాకు రూ.7500, స్వాతికి రూ.5 వేలు చొప్పున బుధవారం మిరుదొడ్డి జడ్పీ పాఠశాలలో ప్రోత్సాహక నగదు బహుతులు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, నైపుణ్య ఆర్గనైజేషన్ సంస్థ జిల్లా అధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు సెల్ ఫోనులు, టీవీలు పక్కన పెట్టి భవిష్యత్తుకు ఒక్క లక్ష్యాన్ని ఎంచుకొని విద్యను అభ్యసించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నైపుణ్య ఆర్గనైజేషన్ జిల్లా కార్యదర్శి ఐలయ్య, మాజీ సర్పంచ్ బాల్రాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగం, కిష్టయ్య, రమేశ్, కుమార్, రాజు ఎల్లం ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం