Viral video : ఓ రెసిడెన్షియల్ అపార్టుమెంట్‌కు సంబంధించిన లిఫ్టులో గ్యాంగ్ వార్ (Gang war) జరిగింది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. చెంపదెబ్బలు కొట్టుకున్నారు. గ్రేటర్ నోయిడా (Greater Noida) లోని సూరజ్‌పూర్ పోలీస్‌స్టేషన్ (Surajpur Police Station) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు ఫూటుగా మద్యం సేవించి ఎటా-II సెక్టార్‌లోని మిగ్సన్ వైన్ సొసైటీలోని ఓ రెసిడెన్షియల్ అపార్టుమెంట్ లిఫ్టులో ఎక్కారు. లిఫ్టు లాకవగానే రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఒకరినొకరు కొట్టుకున్నారు. తన్నుకున్నారు. లిఫ్టులో ఓపెన్ అయిన తర్వాత ఘర్షణను గమనించి సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకున్నారు. గొడవను ఆపారు.
ఆ తర్వాత రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Video: Packed Lift, Punches, Slaps Fly. Drunk Men Clash In Greater Noidahttps://t.co/AoVUivbIzz pic.twitter.com/sTcVq4LEUk
— NDTV (@ndtv) July 16, 2025