Prada | ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ ప్రాడా (Prada) చిక్కుల్లో పడింది. ఇటీవలే ఆ సంస్థ ప్రదర్శించిన చెప్పులు, వాటి ధరలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. స్ప్రింగ్ సమ్మర్ 2026లో భాగంగా ప్రాడా పురుషులకు చెందిన పాదరక్షలను ప్రదర్శించింది. ఇవి అచ్చం భారత్‌లోని కొల్హాపురిలో తయారైన చెప్పులు (Kolhapuri chappals) లాగానే ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు ప్రముఖులు సైతం ప్రాడాపై మండిపడ్డారు.
ఈ వివాదం వేళ ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్ ప్రతినిధుల బృందం (Prada team) తాజాగా భారత్‌కు వచ్చింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ చేరుకుంది. అక్కడ ఐకానిక్ కొల్హాపురి చెప్పుల వెనుక ఉన్న చరిత్ర, నైపుణ్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. చెప్పుల తయారీ విధానాన్ని కూడా వారు స్వయంగా వీక్షించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.
VIDEO | Maharashtra: Team of Italian Fashion House Prada arrived in Kolhapur to learn and explore the legacy of ‘Kolhapuri Chappals’.
Prada presented a design similar to ‘Kolhapuri Chappals’ in the name of ‘Toe-Ring Sandals’ at the Milan Fashion Show, without mentioning Indian… pic.twitter.com/OWjCS8CLox
— Press Trust of India (@PTI_News) July 16, 2025
ప్రాడా స్ప్రింగ్ సమ్మర్ 2026లో భాగంగా ప్రాడా పురుషులకు చెందిన పాదరక్షలను ఇటీవలే ప్రదర్శించింది. ఇవి అచ్చం భారత్‌లోని కొల్హాపురిలో తయారైన చెప్పులు (Kolhapuri chappals) లాగానే ఉన్నాయి. అయితే, వాటి ధర మాత్రం చర్చకు దారితీస్తోంది. సేమ్ డిజైన్‌తో అలాంటి చెప్పులు మన వద్ద రూ.400 వరకు ఉంటాయి. కానీ ప్రాడా మాత్రం ఆ చెప్పుల ధరను ఏకంగా రూ.1.2లక్షలుగా పేర్కొంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏంటీ.. ఈ చెప్పులు అంత ఖరీదా అంటూ చర్చించుకుంటున్నారు. ప్రాడాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గ్లోబల్ బ్రాండ్లు మన సంస్కృతిని సొమ్ము చేసుకుంటున్నాయంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంక (Harsh Goenka) సైతం మండిపడ్డారు.
ఈ వివాదం నేపథ్యంలో ప్రాడాపై ఓ న్యాయవాది కోర్టుకెక్కారు. కొల్హాపురి చేతివృత్తుల వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాంబే హైకోర్టు (Bombay High Court)లో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపురి చేతివృత్తులకు ప్రసిద్ధి. అక్కడ తోలుతో తయారు చేసే చెప్పులు 12వ శతాబ్దానికి చెందినవి. 2019లో ఇవి భౌగోళికంగా గుర్తింపు పొందాయి.
Also Read..
Bomb Threats | ఢిల్లీ పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు.. మూడు రోజుల వ్యవధిలోనే 10వ ఘటన
Aadhaar | కోట్ల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌లోనే ఆధార్ కార్డులు.. ఆర్టీఐ రిపోర్ట్‌లో వెల్లడి