Odisha | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore)లో బీఈడీ విద్యార్థిని (BEd. Student) ఆత్మహత్య (Suicide) ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అది ముమ్మాటికీ బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్య అని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఒడిశా వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విద్యార్థి సంఘాల నాయకులు, పలు పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.
ఈ ఘటనకు నిరసనగా బీజేడీ కార్యకర్తలు (BJD workers) ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒడిశా అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగారు. వందలాది మంది నిరసనకారులు విధాన్ సభ (Bidhan Sabha) ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు నీటి ఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా బిజు జనతాదళ్ బాలాసోర్ బంద్ పాటిస్తోంది.
#WATCH | Bhubaneswar, Odisha | Police use water cannon to disperse BJD workers protesting over Balasore student’s death by self-immolation.
Biju Janata Dal is also observing a Balasore bandh in protest over a Balasore student’s death by self-immolation. pic.twitter.com/jDKQZzCbbq
— ANI (@ANI) July 16, 2025
ఇంతకీ ఏం జరిగిందంటే..?
20 ఏండ్ల బాధిత యువతి బాలాసోర్‌లోని ఫకీర్ మోహన్ అటానమస్ కాలేజీలో బాధిత విద్యార్థిని సెకండియర్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ చదువుతున్నది. అయితే, తన లైంగిక వాంఛలు తీర్చాలంటూ హెచ్‌వోడీ సమీర్ కుమార్ సాహూ కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు ఈ నెల 1న అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై వారం రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆమె ఆశించింది. అయితే కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితురాలు, మిగతా విద్యార్థులు శనివారం (ఈనెల 12న) కాలేజీ గేట్ ముందు ఆందోళన నిర్వహించారు.
హఠాత్తుగా బాధిత మహిళ.. ప్రిన్సిపల్ కార్యాలయం వద్దకు పరుగున వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి గాయపడ్డాడు. తోటి విద్యార్థులు వారిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే బాధితురాలి శరీరం 95 శాతం గాయపడటంతో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె సోమవారం రాత్రి 11.46 గంటలకు మరణించింది.
ఈ ఘటనకు సంబంధించి హెచ్‌వోడీ, ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు. తన కుమార్తె మరణానికి ఐసీసీ సభ్యులే కారణమని, వాళ్లు పక్షపాత ధోరణితో ప్రవర్తించారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. బాధితురాలి స్వగ్రామంలో జరిగిన అంత్యక్రియలకు వేలాదిమంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అది ముమ్మాటికీ బీజేపీ సిస్టమ్ (BJP system) చేసిన హత్య అని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒడిశా బీజేపీ ప్రభుత్వం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ హత్యే
బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందని కాంగ్రెస్ నేత రాహుల్ మండిపడ్డారు.కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినప్పటికీ బాధితురాలికి న్యాయం జరుగలేదని, ఆమె మృతికి సిస్టమ్ ఫెయిల్యూరే కారణమని మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. బీజేపీ ఇచ్చిన ‘బేటీ బచావో.. బేటీ పడావో’ నినాదం క్రమంగా ఒడిశాలో ‘బేటా పడావో.. బేటీ జలావో(కూతురిని తగుల బెట్టండి’)గా మారిందని బీజేడీ మండిపడింది.
Also Read..
Aadhaar | కోట్ల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్‌లోనే ఆధార్ కార్డులు.. ఆర్టీఐ రిపోర్ట్‌లో వెల్లడి
ChatGPT | చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా యూజర్లు ఫిర్యాదు
Infant | రన్నింగ్ బస్సులో బిడ్డకు ప్రసవం.. కిటికీలో నుంచి విసిరేసిన భర్త