Aadhaar | దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోట్ల మంది మరణించినప్పటికీ ఆధార్ (Aadhaar) కార్డులను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) మాత్రం కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే డీయాక్టివేట్ (Aadhaar deactivation) చేసిందని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది. ఇది దేశ మరణాల రేటుతో పోలిస్తే చాలా తక్కువ.
2025 జూన్ నాటికి భారతదేశంలో 142.39 కోట్ల ఆధార్ హోల్డర్లు ఉన్నారు. ఇక ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం.. ఏప్రిల్ 2025 నాటికి దేశ మొత్తం జనాభా 146.39 కోట్లుగా ఉంది. అయితే, 2007-2019 మధ్య ఏడాదికి సగటున 83.5 లక్షల మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన గత 14 సంవత్సరాల్లో 11.69 కోట్ల మంది మరణించి ఉండొచ్చు. అయినప్పటికీ ఉడాయ్ (UIDAI) ఈ 14 ఏళ్లలో కేవలం 1.15 కోట్ల ఆధార్ నంబర్లను మాత్రమే మరణాల ఆధారంగా డీయాక్టివేట్ చేసింది. ఇది దేశ మరణాల రేటుతో పోలిస్తే 10 శాతం మాత్రంగానే ఉంది. అయితే, ఈ ప్రక్రియ మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యులు ఇచ్చే సమాచారం ఆధారంగా జరుగుతుందని సమాచార హక్కు చట్టం ద్వారా ఉడాయ్ వెల్లడించింది. 2024 డిసెంబర్ 31 నాటికి మరణాల ఆధారంగా మొత్తం 1.15 కోట్ల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ చేసినట్లు ఉడాయ్ తెలిపింది.
Also Read..
ChatGPT | చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. సోషల్ మీడియా ద్వారా యూజర్లు ఫిర్యాదు
NATO | రష్యాతో వ్యాపారం చేస్తే 100 శాతం సుంకం.. భారత్‌కు నాటో హెచ్చరికలు
Infant | రన్నింగ్ బస్సులో బిడ్డకు ప్రసవం.. కిటికీలో నుంచి విసిరేసిన భర్త