NATO | ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యా (Russia)ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని యోచిస్తోంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న (Russia business ties) భారత్, చైనాపై 500 శాతం సుంకాలు (500 Percent tariff) విధిస్తామని రిపబ్లికన్ సెనేటర్ ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా నాటో (NATO) కూడా ఇలాంటి హెచ్చరికలే చేసింది.
మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్ సహా చైనా, బ్రెజిల్‌పై 100 శాతం సుంకం విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె (Mark Rutte) హెచ్చరించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు.. ఎవరైనా సరే రష్యాతో వ్యాపారం చేస్తూ వారి నుంచి చమురు (Russian oil), గ్యాస్ వంటివి కొనుగోలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా దేశాలపై 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
భారత్‌పై అమెరికా 500 శాతం సుంకాలు..!
మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న (Russia business ties) భారత్, చైనాపై 500 శాతం సుంకాలు (500 Percent tariff) విధిస్తామంటూ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం (Lindsey Graham) ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఓ బిల్లును కూడా తీసుకురానున్న తెలిపారు. ‘రష్యా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం ఉంటుంది. భారత్ (India), చైనా (China) దేశాలు మాస్కో నుంచి 70 శాతం చమురు కొనుగోలు చేస్తున్నాయి’ అని అన్నారు.
రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అధిక సుంకాలు విధించేలా ట్రంప్ మద్దతుతో యూఎస్ సెనేట్‌లో బిల్లును తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ బిల్లు వచ్చే నెలలోనే ప్రవేశ పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడి చముర కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. చైనా సైతం మాస్కో నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీంతో యూఎస్ తెచ్చే ఈ బిల్లు భారత్, చైనా దేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
Also Read..
Dreams | పీడకలలతో వేగంగా ముసలితనం! అకాల మరణ ముప్పు అధికం
బంగ్లాదేశ్‌లో సత్యజిత్ రే పూర్వీకుల ఇల్లు కూల్చివేత!
అమెరికాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు