ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న ప్రముఖ భారతీయ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే పూర్వీకుల నివాసాన్ని బంగ్లాదేశ్ అధికారులు కూలగొడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ మంగళవారం తెలిపారు. హోర్కిషేర్ రే చౌదరీ రోడ్లో ఉన్న శతాబ్ద కాలం నాటి ఈ ఇల్లు సత్యజిత్ రే తాత ఉపేంద్ర కిషోర్ రే చౌదరిదని చెప్పారు.
ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. దీనిపై స్పందించిన కేంద్రం.. కూల్చివేతపై పునరాలోచించాలని, ఇల్లు మరమ్మతుకు సాయం అందిస్తామని బంగ్లాదేశ్ సర్కారును కోరింది.