ChatGPT | ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌బాట్ (AI chatbot) చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. చాట్‌బాట్‌ను ఓపెన్ చేస్తుంటే.. ఎర్రర్ మెసేజ్‌లు వస్తున్నాయి. చాట్ హిస్టరీ లోడ్ అవ్వట్లేదు. దీనిపై యూజర్లు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు.
డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. భారత్ సహా ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లోని యూజర్లు ఈ సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు 82 శాతం మంది యూజర్లు చాట్‌జీపీటీ సేవలు పొందలేకపోతున్నారు. మొబైల్ యాప్, వెబ్ రెండింటిలోనూ ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాదు లాగిన్, నెట్వర్క్ ఎర్రర్, యాప్ సంబంధిత ఇతర సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేస్తున్నారు. తాజా సమస్యపై ‘ఓపెన్ఏఐ (OpenAI)’ సంస్థ స్పందించింది. సమస్యను గుర్తించామని, దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. చాట్‌జీపీటీ రికార్డ్ మోడ్, సోరా, కోడెక్స్ వంటి సేవల్లో అంతరాయం ఉన్నట్లు తెలిపింది.
Also Read..
Deepak Tilak: లోక్మాన్య తిలక్ మునిమనవడు దీపక్ తిలక్ కన్నుమూత
Infant | రన్నింగ్ బస్సులో బిడ్డకు ప్రసవం.. కిటికీలో నుంచి విసిరేసిన భర్త