పుణె: లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ముని మనవడు, మరాఠీ భాష కేసరి పత్రిక ట్రస్టీ ఎడిటర్ దీపక్ తిలక్(Deepak Tilak) ఇవాళ కన్నుమూశారు. పుణెలోని నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన వయసు 78 ఏళ్లు. వయసు సంబంధిత రుగ్మలతో ఆయన బాధపడుతున్నట్లు తెలిసింది. దీపక్ తిలక్‌కు ఓ కుమారుడు, కుమార్తె.. మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు తిలక్‌వాడలో ఆయన పార్దీవదేహాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. వైకుంఠ శ్మశానవాటికలో ఆయన పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లోక్మాన్య తిలక్ 1881లో ప్రారంభించిన కేసరి పత్రికకు దీపక్ తిలక్ ట్రస్టీ ఎడిటర్‌గా చేస్తున్నారు. తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠంలో వైస్ ఛాన్సలర్‌గా చేశారు. అకాడమిక్, జర్నలిస్టు సర్కిల్లో దీపక్ తిలక్‌కు మంచి గుర్తింపు ఉన్నది.