Harish Rao | రాయపోల్, నవంబర్ 02 : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల కన్నుమూశారని తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు హరీశ్ రావును పరామర్శిస్తూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. హైదరాబాద్ కోకాపేటలో క్రిస్ విల్లాలోని వారి నివాసంలో హరీశ్ రావును ఆదివారం పరామర్శించడం జరిగిందని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ తెలిపారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేఆర్ భీమసేన, జాతీయ మాల మహానాడు రాష్ట్ర నాయకుడు తుమ్మ శ్రీనివాస్‌లతో కలిసి వారిని పరామర్శించారు. అనంతరం సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సత్యనారాయణ రావు అకాల మృతి పట్ల చింతిస్తున్నామని, వారి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ముబాషీర్, ప్రధాన కార్యదర్శి, జర్నలిస్ట్ పుట్ట రాజు, కోశాధికారి మహమ్మద్ ఉమర్, మహమ్మద్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
KTR | ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతారు.. జూబ్లీహిల్స్ ఓటర్లకు కేటీఆర్ సూచన
ISRO | నిప్పులు చిమ్ముతూ.. నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్..!
Khawaja Asif | మమ్ములను ఘర్షణలతో బిజీగా ఉంచాలన్నదే భారత్ వ్యూహం.. మరోసారి పాక్ ప్రేలాపన