MLA Kotha Prabhakar Reddy | తొగుట, నవంబర్ 15 : తెలంగాణ ఉద్యమ కారుడు, ఘనపూర్‌కు చెందిన కొమ్ము కిషన్ అకాల మరణం బాధాకరమని, వారి కుటుంబానికి అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఘనపూర్ లో ఇటీవల మరణించిన కొమ్ము కిషన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుండి పనిచేసిన కొమ్ము కిషన్ జైలుకు సైతం వెళ్లాడని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పలువురు బాధిత కుటుంబాలకు పరామర్శ..
ఘనపూర్‌లో ఇటీవల యాటెల్లి రాజు తండ్రి మరణించడంతో రాజు వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. ఇటీవల ప్రమాదానికి గురైన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మంగలి యాదగిరిని, రాంపూర్‌లో ఇటీవల మరణించిన బిఆర్ఎస్ యువ నాయకుడు తోయేటి వెంకటేశం కుటుంబాన్ని, అప్పనపల్లి రాములు కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. వారి కుటుంబాలకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సొసైటీ చైర్మన్ హరికృష్ణ రెడ్డిని గుడికందులలో ఎమ్మెల్యే పరామర్శించారు. హరికృష్ణ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అదే గ్రామానికి చెందిన ఇటీవల వివాహం చేసుకున్న కొక్కొండ నాగార్జున రెడ్డి – అఖిల దంపతులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆశీర్వదించారు. గ్రామంలో నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హల్ నిర్మాణాన్ని పరిశీలించారు.
బాలికల గురుకుల కళాశాలలో ఆకస్మిక తనిఖీ..
రాంపూర్‌లోని బాలికల గురుకుల కళాశాలను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులకు సరైన విద్య భోజనం వసతులు అందుతున్నాయా అని ఆరా తీశారు ఈ సందర్భంగా కళాశాలలో నెలకొన్న విద్యుత్ తాగునీటి క్రీడాస్థల సమస్యలను ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విద్యార్థినిలు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, నాయకులు చిలువెరి మల్లారెడ్డి, సుకూరి లింగం, బాలరాజు, బోధనం కనకయ్య, సుతారి రమేష్, కొమ్ము శరత్, కుర్మ యాదగిరి, బాలరాజు, ఎల్లం,, శ్రీనివాస్ గౌడ్, మంగ నర్సింలు, యాదగిరి, అశోక్, రాజిరెడ్డి, భైరాగౌడ్, బాల్ రెడ్డి, బైరారెడ్డి, జంగిడి బిక్షపతి, రాజశేఖర్, బండారు స్వామి గౌడ్ తదితరులు ఉన్నారు.



Metro Station | ఢిల్లీ పేలుడు.. నాలుగు రోజుల తర్వాత తెరుచుకున్న రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్
Suryapet : లబ్ధిదారులకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ