సూర్యాపేట, నవంబర్ 15 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు శనివారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి చేశారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా పలు రకాల ప్రమాదాలు, అనారోగ్యంతో వైద్య సేవలు పొందిన 81 మంది లబ్ధిదారులకు ఆయన అయన ఈ చెక్కులను అందజేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి సతీమణి లావణ్య రెడ్డి తండ్రి బీరవెల్లి కృష్ణారెడ్డి మృతిచెందగా భౌతిక కాయాన్ని జగదీశ్‌రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Suryapet : లబ్ధిదారులకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ