MLA Kotha Prabhakar Reddy | చేగుంట, సెప్టెంబర్ 4 : ఎప్పుడూ రద్దీగా ఉండే చేగుంట పట్టణంలోని మెదక్ రోడ్లో రైల్వే గేటు మూలంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ విషయాన్ని నాడు ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చేగుంట – మెదక్ రోడ్డులో ఆర్ఓబీ (Road over Bridge)మంజూరు కోసం పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి వినతి పత్రాలు అందించారు.
అయితే వీటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు కేటాయించాలని షరతులు విధించి.. వారు మంజూరు చేయలేకపోయారు. ఆ తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం 2023 డిసెంబర్ 11న ఎంపీ పదవికి రాజీనామా సమర్పించక ముందు చివరి సారి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ఢిల్లీలో కలిసి మరోమారు చేగుంట ఆర్ఓబి కోసం వినతి పత్రం అందించగా.. తప్పకుండా పూర్తిస్థాయి కేంద్ర నిధులతో చేగుంట వద్ద ఆర్ఓబి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటీవల ఆర్ఓబీ నిర్మాణం కోసం రూ.48.77 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయటం జరిగింది.
ఈ సందర్భంగా తన విజ్ఞప్తికి స్పందించిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఓబీని మంజూరు చేయించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి చేగుంట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
GST | సిమెంట్, ఉక్కుపై జీఎస్టీ రేట్ల తగ్గింపు.. రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహం..!
Laxmidevipally : ‘పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి’
Nur Khan Base | భారత్ దాడిలో దెబ్బతిన్న నూర్ఖాన్బేస్లో పునర్నిర్మాణ పనులు చేపడుతున్న పాక్