Kotha Prabhakar Reddy | దుబ్బాక, మార్చి17 : సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, తలాపునా మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నా దుబ్బాక నియోజకవర్గం రైతులు సాగునీటి కష్టాలు పడుతున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ఇవాళ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కలిశారు.
దుబ్బాక నియోజకవర్గంలోని సాగునీటి సమస్యను పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి నమస్తే తెలంగాణతో ఫోన్లో మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నుండి 300 క్యూసెక్కుల నీరు కూడవెల్లివాగులోకి విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించి, సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
మల్లన్న సాగర్ నుండి కూడవెల్లికి నీరు విడుదల చేస్తున్నందున వాగు పరిసర గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే రామయంపేట, చిన్న శంకరంపేట, దుబ్బాక మండలాల్లో పలు చోట్ల ఉప కాల్వల నిర్మాణ పనులు నిలిచిపోయాయని, వాటిని త్వరితగతిl నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Read Also :
HYDRAA | బండ్లగూడలో హైడ్రా కూల్చివేతలు
ASP Chittaranjan | విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం తథ్యం : ఏఎస్పీ చిత్తరంజన్
Harish Rao | కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్: హరీశ్‌రావు