Mission Bhagiratha Water | చేర్యాల, జూన్ 22 : చేర్యాల మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఆకునూరులో గత రెండు మాసాలుగా మిషన్ భగీరథ జలాలు లీకేజీ అవుతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీ సమీపంలోనే సదరు లీకేజీ ఉండడం గమనార్హం.
భగీరథ జలాల నీటి సరఫరా సమయంలో గేట్ వాల్వ్ చాంబర్ వద్ద నిత్యం పవిత్ర గోదావరి జలాలు లీకేజీ అవుతూ ప్రవహించి చిన్నపాటి గుంతగా మారినప్పటికి అధికారులు దానిని మరమ్మత్తు చేసే విషయంలో మాత్రం ఎలాంటి శ్రద్ధ చూపించడం లేదు.
నీటి లీకేజీ విషయాన్ని స్ధానికులు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకుపోయినప్పటికి నిధులు లేవని, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకువచ్చి దానిని బాగు చేయాలని జవాబు ఇచ్చినట్లు పలువురు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వెంటనే లీకేజీ అవుతున్న గేట్వాల్ వద్ద మరమ్మత్తులు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Alumni | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పాతికేళ్ల తర్వాత పూర్వ విద్యార్థులంతా కలిశారు
Rayaparthi | వ్యవసాయ భూములకు వెళ్లే బాట కబ్జా.. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన
Suryapet | కేసుల పరిష్కారంలో న్యాయవాదుల సహకారం అవసరం : జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన