కోహెడ మే 23 : రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం మండలంలోని బస్వాపూర్ గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. హైద్రాబాద్ నుండి హుస్నాబాద్ వెల్తున్న పొన్నం ప్రభాకర్ మార్గ మధ్యంలో ఆగారు. బస్వాపూర్‌లో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఇండ్లలో నీళ్లు వచ్చాయని గ్రామస్తులు తెలుపటంతో జరుగుతున్న రోడ్డుపనులపై ఆరా తీశారు. వెంటనే కంట్రాక్టర్‌కు ఫోన్ చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మంద ధర్మయ్య, నాయకులు తడిసిన రవీందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు , వివిధశాఖల అధికారులున్నారు.
ఇవి కూడా చదవండి..
Snakebite Scam | ఒక వ్యక్తిని 38 సార్లు పాము కాటేసింది.. రూ.11 కోట్లు పరిహారం ఇచ్చారు: జితు పట్వారీ
Preity Zinta | పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం.. కోర్టుకెక్కిన బాలీవుడ్ నటి ప్రీతి జింటా..!