Preity Zinta | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టును ఆశ్రయించారు. పంజాబ్ కింగ్స్ జట్టు యాజమాన్య సంస్థ కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ సహ డైరెక్టర్లు మోహిత్ బర్మన్, నెస్ వాడియాలకు వ్యతిరేకంగా ఆమె చండీగఢ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 21న జరిగిన ఈజీఎం చట్టబద్దత, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కోర్టులో సవాల్ చేశారు. ఏప్రిల్ 21న జరిగిన ఈజీఎంలో మునీష్ ఖన్నాను కొత్త డైరెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే, సమావేశం నిర్వహణలో కంపెనీల చట్టం, 2013లోని నిబంధనలు, ఇతర సెక్రటేరియల్ నియామకాలు పాటించడంలో ప్రీతి జింటా పిటిషన్లో ఆరోపించారు. అయితే, ఏప్రిల్ 10న మెయిల్ ద్వారా సమాచారం అందించినప్పటికీ.. తాను లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదని ఆరోపించారు.
Read Also : Team India | ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్.. రేపు భారత జట్టును ప్రకటించనున్న బీసీసీఐ..!
ప్రీతి జింటాతో పాటు మరో డైరెక్టర్ కరణ్ పాల్ సైతం సమావేశంలో పాల్గొన్నారు. ప్రీతితో పాటు కరణ్ సైతం మునీష్ కన్నా నియమాకాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా మోహిత్ బర్మన్, నెస్ వాడియా మద్దతు సమావేశాన్ని కొనసాగించి.. తన నియామకాన్ని ఖరారు చేసినట్లు ప్రీతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఏప్రిల్ 21న జరిగిన సమావేశం, అందులో తీసుకున్న నిర్ణయాలన్నింటిని రద్దు చేయాలని ప్రీతి కోర్టును కోరారు. మునీష్ ఖన్నా డైరెక్టర్‌గా వ్యవహరించకుండా నిరోధించాలని కోరారు. కేసు పరిష్కారమయ్యే వరకు తాను, కరణ్ పాల్ లేకుండా మునీష్ కన్నా ప్రేమయం లేకుండా కంపెనీ బోర్డు.. సర్వసభ్య సమావేశం నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పరిణామం ఐపీఎల్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆటతీరు గురించి మాట్లాడుకుంటున్న అభిమానులు, ఇప్పుడు యాజమాన్య సంక్షోభం చర్చనీయాంశమైంది.
Read Also : Naman Dhir | ముంబై ఇండియన్స్‌కు ఆ బెంగ తీర్చిన అన్సంగ్ హీరో నమన్ ధీర్