Team India | ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును మే 24న (శనివారం) ప్రకటించే అవకాశాలున్నాయి. జూన్ 20న హెడింగ్లీలో సిరీస్‌తో భారత్ పర్యటనను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ది ఓవల్‌లో మ్యాచులు జరుగనున్నాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ముంబయిలో జరిగే విలేకరుల సమావేశంలోనే జట్టును ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మే 24న లేదంటే 25న ప్రకటిస్తారా? అన్నదానిపై కొంత గందరగోళం నెలకొంది. ఎక్కువగా శనివారమే జట్టును ప్రకటించే అవకాశం ఉందంటూ బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది.
అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముందుగానే టెస్ట్ జట్టును ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ, రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం.. విరాట్ కోహ్లీ సైతం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇద్దరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టెస్ట్ జట్టు ఎంపికను రెండువారాల పాటు వాయిదా వేశారు. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ రేసులో శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. అయితే, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సైతం రేసులో ఉన్నారు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్‌కు చేర్చి.. అందరి ప్రశంసలు అందుకున్నాడు.
శుభ్‌మన్ గిల్, గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ జోడీ అయిన బీ సాయి సుదర్శన్ నార్తాంప్టన్‌లో ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగే రెండో మ్యాచ్‌కు ముందు ఇండియా ‘ఏ’ జట్టులో చేరనున్నారు. భారత టెస్ట్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ లాంటి ఆటగాళ్లు మే 30న జరిగే మొదటి మ్యాచ్ కంటే ముందే మే 25న ఇతర భారత ‘ఎ’ జట్టు సభ్యులతో కలిసి ఇంగ్లాండ్‌కు బయలుదేరే అవకాశాలున్నాయి. ఆదివారం సాయంత్రం అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఆడిన తర్వాత మే 26న ఉదయం భారత ‘ఎ’ జట్టు సభ్యులైన నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షిత్ రాణా, హర్ష్ దూబే న్యూఢిల్లీ నుంచి ఇంగ్లాండ్‌కు బయలుదేరే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో కేకేఆర్, ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.