Supreme Court | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థులు ఆత్మహత్య (Prevent Suicides)లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఒత్తిడి కారణంగా గత కొంతకాలంగా విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. వసతి గృహాల్లోని ఫ్యాన్లకు ఉరివేసుకోవడం, విషం తాగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఇది చాలా ఆందోళకరమైన విషయం అంటూ రాజస్థాన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది.
విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని నిలదీశింది. వీటిని తేలికగా తీసుకోవద్దన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఏడాది కోటాలో ఇప్పటి వరకూ 14 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
విద్యార్థుల మరణాలు చాలా తీవ్రమైన సమస్యగా అభివర్ణించింది. వీటిని తేలిగ్గా తీసుకోకూడదని పేర్కొంది. ‘మీరు ఏం చేస్తున్నారు..? ఇంత మంది పిల్లలు కోటాలో మాత్రమే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు..? దీని గురించి మీరు ఆలోచించలేదా..?’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదిని జస్టిస్ పార్దివాలా ప్రశ్నించారు. ‘కోటాలో ఇప్పటి వరకూ ఎంత మంది యువ విద్యార్థులు మరణించారు..? విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు..?’ అంటూ కోర్టు ప్రశ్నించింది.
Also Read..
ComeBack Rally | రేప్ కేసులో బెయిల్.. నిందితుల విజయోత్సవ ర్యాలీ.. VIDEO
Amit Shah | ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి దీటైన జవాబు : అమిత్ షా